top of page

ABOUT ATMA

వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ)
 
         జాతీయ వ్యవసాయ సాంకేతిక పధకము (ఎన్.ఎ.టి.పి), వ్యవసాయ పరిశోదన మరియు విస్తరణ భాగంలో వారి శక్తి సామర్ధ్యాలను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పెంపొందించడంతో పాటు ఈ విభాగంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావడానికి కారణమైనదిగా పేర్కొనవచ్చును. ఈ పధకము 1999 నుండి 2005 వరకు ప్రపంచ బ్యాంకు నిధులతో ఆంద్రప్రదేశ్ లో నాలుగు జిల్లాలలో అనగా కర్నూలు, ప్రకాశం, అదిలాబాద్ మరియు చిత్తూరులలో పైలెట్ ప్రాతిపదికన ప్రారంభించడమైనది.
 
              తదుపరి భారత ప్రభుత్వము విస్తరణ సంస్కరణలు పధకము క్రింద దేశ వ్యాప్తముగా 252 జిల్లాలలో 2005వ సంవత్సరము జూన్ నెల నుండి ఆంద్రప్రదేశ్ లో 6 జిల్లాలు ఎంపిక చేయబడినవి. 2008-09 సంవత్సరములో 4 జిల్లాలు అనగా విజయనగరము, విశాఖపట్నము, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలు చేర్చబడినవి.
 
1. రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ ప్రధాన కార్యదర్శి నేతృత్వములో వ్యవసాయ మరియు ఇతర అనుభంద శాఖల అధికారులతో కూడిన      ఇంటర్ డిపార్టమెంటల్ వర్కింగ్ గ్రూపు ఈ పధకం పాలసీని అభివృద్ది చేస్తుంది. మరియు వ్యవసాయము, ఇతర అనుభంద          
   శాఖల సమన్వయముతో సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించుటకు తోడ్పదుతుంది.
2. వ్యవసాయ శాఖ కమీషనరు రాష్ట్ర స్థాయిలో ఆత్మ పథకము నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.
3. నిధుల మంజూరు కొరకు జిల్లాల ఆత్మ అధికారులకు మరియు మానవ వనరుల అభివృద్ధికు సహాయకారిగా వుండుటకు రాష్ట్ర      
     స్థాయిలో సమేతి తోడ్పడుతుంది.
4. విస్తరణ సంస్కరణలు అమలు చేయుటకు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) కు జిల్లా కలెక్టరు గారు చైర్మన్ గా      
    వుండి ఈ పధకము యొక్క లక్ష్యములు పర్యవేక్షించడము అంశాలు అమలుచేయడము మరియు జిల్లాలోని వివిద                
   వ్యవసాయ మరియు ఇతర అనుభంద శాఖలయిన పశు సంవర్దక , పట్టు, మత్స్య మరియు ఉద్యాన వగైరాలతో పాటు రైతు
   సంఘాలు ఆత్మ ద్వారా సమన్వయముతో పనిచేయుట కొరకు కృషి చేస్తున్నారు. పరిశోదన విస్తరణల ద్వారా మారుతున్న
   సాంకేతిక పరిజ్ఞానము       రైతులకు అందించి వారి అభివృద్దికి తోడ్పడుతుంది.
5. ఆత్మ కార్యక్రమములు జిల్లాలోని 8 బ్లాకుల సహాయ వ్యవసాయ సంచాలకులు మరియు రైతు సలహాకమిటీ వారి ద్వారా అమలు       చేయబడుచున్నది.
 
ఆత్మ లక్ష్యములు
1. ప్రస్తుతము వున్న విస్తరణ విభాగములను బలోపేతము చేయుట, జిల్లా పరిదిలో వికేంద్రీకరణ ప్రణాళిక రచన.
2. ప్రణాళిక అమలునందు రైతులను భాగస్వామ్యము చేయుట.
3. వివిధ విస్తరణ విభాగములను సమన్వయ పరచుట.
4. పరిశోదన – విస్తరణ – మార్కెటింగ్ రైతు లింకేజీలను బలోపేతము చేయుట.
5. వివిధ శాఖలకు టెక్నాలజీ గ్యాపుల సవరణకు తోడ్పడుట.
6. రైతు గ్ర్రూపులను బలోపేతము చేయుట.
       
పధక సంచాలకులు,ఆత్మ
విజయనగరము    

© 2014 by S.V.Satyadev Anand , Computer Programmer (B.Tech (CSE)), ATMA, Vizianagaram

bottom of page